అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు సమర్పణలో నిర్మితమౌతున్న ‘మేజర్’ మూవీ మే 27న విడుదల కాబోతోంది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున తమ ‘రంగరంగ వైభవంగా’ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఆ మధ్య సీనియర్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తెలిపారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ వెంటనే…