సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇటీవల జరిగిన రోడ్ యాక్సిడెంట్ నుండి నిదానంగా కోలుకుంటున్నాడు. దాంతో అతని తాజా చిత్రం ‘రిపబ్లిక్’ మూవీ విడుదలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు సినిమా సెన్సార్ ను కంప్లీట్ చేశారు. తమ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించిందని, ముందు అనుకున్న విధంగానే గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న మూవీని విడుదల చేస్తామని…
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో…
(సెప్టెంబర్ 15న అభినేత్రి రమ్యకృష్ణ పుట్టినరోజు)రమ్యకృష్ణ- ఈ పేరులోనే అందం ఉంది. ఇక రమ్యకృష్ణ అందం ఆ రోజుల్లో ఎందరికో బంధాలు వేసింది. ప్రస్తుతం ఆమె అభినయంతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అందాల అభినేత్రిగా సాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటి ప్రేక్షకులకు ‘బాహుబలి’ సిరీస్ లో శివగామిగా గుర్తుండి పోయారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వారికి ఓ బాబు ఉన్నాడు. ఇప్పటికీ రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు. ఆ రోజుల్లో గ్లామర్…