వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై గతేడాది ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేసారు. అప్పట్లో విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు. కానీ కొన్ని నెలలుగా విచారణకు…