జనం కళ్ళింతలు చేసుకొని అమితాసక్తితో ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్నింగ్ లో ఉన్న అన్ని థియేటర్లలోనూ ‘ఆర్.ఆర్.ఆర్.’ విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాకు గుండెకాయలాంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రతి ఊరిలో అన్ని సినిమా హాళ్ళలోనూ ‘ట్రిపుల్ ఆర్’ సందడి చేయబోతోంది. తెలుగునాట చాలా రోజులకు విడుదలవుతోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ జేజేలు అందుకుంటోంది. అందువల్ల ఆ సినిమాకు ఉన్న…