(ఆగస్టు 24న గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు) పాటతో ప్రయాణం చేయాలనే తొలి నుంచీ ఆశించారు రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన అభిలాష పాటలు పాడాలన్నది. కానీ, పాటలు రాసే పనిలో విజేతగా నిలిచారు. అదే చిత్రం! చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలకు కొదవే లేదు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాట లేకుండా పలకరించే చిత్రాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నేటి సినిమా రంగంలో బిజీగా సాగుతున్న గీత రచయితల్లో ముందువరుసలో ఉన్నారు రామజోగయ్య శాస్త్రి.…