మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ హిట్ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. రామ్ చరణ్ వీడియో బైట్‌లో మాట్లాడుతూ, “‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఓ డ్రీమ్ టీం సృష్టి. చిరంజీవి,…