అయోధ్యలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మొత్తం 7000 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. లాల్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.