దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 50 రోజులు దాటినా పలు చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో కనిపించడం లేదు. అలాంటిది 50 రోజులు దాటినా ఆర్.ఆర్.ఆర్ ఇంకా థియేటర్లలో ఆడుతోంది అంటే మాములు విషయం కాదు.…