యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. కోమలిప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం చిత్ర కథానాయకుడు రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని…