భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు.
సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా మహిళామణులకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు 48 గంటల పాటు మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.
TSRTC special Offer for rakhi festival: శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండగ కోసం అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా తోబుట్టువులందరూ రాఖీ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ప్రేమను అందజేస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్‌ను అమలులోకి తెచ్చింది. కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించే అవకాశం కల్పిస్తోంది. దూర ప్రాంతాల్లో ఉండే ఆడపడుచులు తమ అన్నదమ్ములకు స్వయంగా వెళ్లి…