నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.