ఆర్. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది..
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు ఎన్డీఏ కూటమిలో పడటం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలోపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.