Margadarsi Chit Fund: ఈ ఆర్థిక సంవత్సరంలో మార్గదర్శి చిట్‌ఫండ్ టర్నోవర్ 12 వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. గతేడాది టర్నోవర్ 9 వేల 7 వందల 12 కోట్ల రూపాయలని తెలిపారు. మార్గదర్శికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ఈ 60 ఏళ్లలో 60 లక్షల మందికి పైగా చందాదారులకు సేవలందించామని శైలజా కిరణ్ పేర్కొన్నారు.