77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల పేర్లు విడుదల చేయగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి పద్మ శ్రీ లభించింది. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో రాజేంద్రప్రసాద్ స్పందించారు “నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని…