Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం…