దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ‘ఈగ’ ( 2012 )చిత్రం మరోసారి వార్తల్లోకి నిలిచింది. అప్పట్లో తన వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కారణం మలయాళ మూవీ ‘లవ్లీ’ పై కాపీరైట్ వివాదం. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మితమైన ‘ఈగ’ చిత్ర నిర్మాతలు తాజాగా మలయాళ చిత్రం ‘లవ్లీ’ టీమ్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కనిపించిన పలు అంశాలు, ముఖ్యంగా…