జన్వాడ్ ఫాంహౌస్ పార్టీకి సంబంధించి రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు
నిన్న రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన సందర్భం అని, 2, 3 రోజుల్లో ఒక రోజు వెజ్, మరో రోజు నాన్ వెజ్ లతో వంటలతో ప్రోగ్రాంలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదని, అక్కడ పోలీసులు దాడులు చేశారన్నారు.