ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. రైతు భరోసా కేంద్రాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు కాని వారిని రైతులుగా చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలతో విషప్రచారం చేస్తున్నాయని.. ఇలాంటి వార్తలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని…