ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు.