తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని…