Different Weather: తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. అయితే నిన్న కొన్ని జిల్లాల్లో వర్షం కురియడంతో జనం కాస్త సేద దీరారు. నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టగా… తర్వాత చిరు జల్లులు కురిశాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈదురు గాలుల వాన భీబత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు ఆత్మకూరులో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.…