హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఉండటంతో.. అది గమనించని ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నీరు నిలిచిపోవడంతో వారి ఎస్‌యూవీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వారు బయటకు రాలేక కారులోనే ఉండటంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శనివారం తెలిపారు.