శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది.
శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువతి తన కారుతో వెళ్లిన వీడియో షూట్ చేసింది. ఇక, ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్‌గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.