కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నారా..? రాహుల్ గాంధీతో భేటీ అయ్యారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా సాగుతోంది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లోనూ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఆ…