ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ని పూణేలో చేదు అనుభవం ఎదురయ్యింది. పూణేలోని రాజా బహదూర్ మిల్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా పోలీసులు వచ్చి, షో ఆపేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమిళ ప్రజలు రెహమాన్ కి అవమానం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెహమాన్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో…