తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు పదవీ విరమణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ - ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికింది.