యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ‘రాధేశ్యామ్’ చిత్రబృందం మొత్తం హాజరైంది. ఇక ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఆయనే తమిళనాడులో “రాధేశ్యామ్”ను విడుదల చేస్తుండడం విశేషం.…