తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫోన్ టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 10గంటల పాటు విచారించిన అనంతరం రాధాకిషన్‌రావును అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్నారు.