Racist comments: భారత సంతతికి చెందిన మహిళను ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ వ్యక్తి చేసిన ‘‘జాతి విద్వేష వ్యాఖ్యలు’’ వైరల్‌గా మారాయి. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తప్పతాగి ఉన్న వ్యక్తి భారత్‌తో పాటు ఆ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి మాంచెస్టర్‌కి రైలులో వెళ్తున్న క్రమంలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ గాబ్రియెల్ ఫోర్సిత్ జాతివిద్వేషాన్ని ఎదుర్కొన్నారు.