తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పక్కన పెట్టారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
Get Out Ravi: తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార డీఎంకే, గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రసంగం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ‘‘ గెట్ అవుట్ రవి’’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడు ప్రజలు, డీఎంకే పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గవర్నర్ రవికి వ్యతిరేకంగా కామెంట్స్…