హైదరాబాద్ లోనే ఉంటూ కోరుకున్న ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నట్టు భ్రమింప చేస్తున్న రోజులివి. ‘వర్చువల్ టెక్నాలజీ’తో ఇప్పటికే మీడియా ఈ దిశగా సాగుతూ పలు ప్రయోగాలు చేస్తోంది. సినీజనం కూడా అదే బాటలో పయనిస్తూ వర్చువల్ ప్రొడక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. సృజనాత్మకత కలిగిన ఎందరో దర్శకులు, నిర్మాతలు ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా తమ ప్రాజెక్ట్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కొందరు విదేశాలకు పరుగులు తీసి వర్చువల్ గా తమ…