Indian companies Q3 earnings: ఇండియన్ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్‌లో మంచి ఫలితాలు సాధించాయి. విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం దిగిరావటం వల్ల రాబడులు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ రంగాలు ఈ ఆదాయ వృద్ధిలో ముందంజలో నిలిచాయి. అదే సమయంలో ఆయిల్, గ్యాస్, మెటల్ సెక్టార్లు వెనుకంజ వేశాయి. ఈ 3 నెలల్లో వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టింది.
IT Companies Q3 Performance: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసింది. దీంతో.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఈ 3 నెలల ఉమ్మడి పనితీరుకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు అధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3 దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కూడా తమ లాభనష్టాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాయి.