Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.