కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి. రవీంధ్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోవైపు వరుసగా ఓడిపోయినా ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ... ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్నామని పుత్తా ఫ్యామిలీ చెబుతోంది.…