డేవిడ్ వార్నర్ లైవ్ మ్యాచ్‌లో పుష్ప పాటకు స్టెప్పులేశాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పుష్ప స్టెప్పులు వేసి అభిమానులను సంతోషపరిచాడు. వార్నర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.