సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారిగా గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. 2021 మార్చి మూడవ వారంలో ‘పుష్ప’ కోసం మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన…