ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.…