విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీంకు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ “లైగర్” సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. ఆ తరువాత అనుకోని అతిథిలా వచ్చిన ఆయనతో మాట్లాడి ఫోటోలకు…