హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవుతుంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ప్రేమకు చిహ్నాలుగా కట్టిన కట్టడాలు ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి పురానాపూల్ బ్రిడ్జి. ఈ వంతెన ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. కులీకుతుబ్ షా, భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించారు. గోల్కొండ కోటలో ఉండే కులీకుతబ్ షా, మూసీ నదికి ఇవతల ఉండే భాగమతి ప్రేమలో పడిన తరువాత మూసీని దాటేందుకు…