విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు.