ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అనూహ్య విజయాలతో లక్నో దూసుకువెళుతోంది. లీగ్ లోకి పసికూనగా ప్రారంభించిన లక్నో ప్రస్థానం అప్రమతిహతంగా సాగుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ సూపర్ కింగ్స్ మరోసారి అపజయం మూటగట్టుకుంది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. దీంతో 113 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ బౌలర్లు రాణించి 153 పరుగులకే లక్నోను కట్టడిచేశారు. అయితే,…