బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్‌ఎస్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…