మరో రెండ్రోజుల్లో జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. జూలై నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూలైలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. జూలై నెలలో 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.…