Pakistan: నిజానికి పాకిస్థాన్‌ను శాసించేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు కాదని.. పాక్ సైన్యం అని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. అంతటి శక్తి ఉంటుంది దాయాది దేశంలో సైన్యానికి. పాకిస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా పాక్ సైన్యం.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తర్వాత, మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన ముత్తహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) పాకిస్థాన్‌పై సైన్యం నిఘా పెట్టినట్లు సమాచారం.…