హోలీకి ముందు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త గోధుమ సేకరణ విధానాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదించారు. దీంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గోధుమ మద్దతు ధరను గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.150 పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గోధుమ మద్దతు ధర (MSP)ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఏపీ తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీకి లబ్ధి చేకూరేలా కొన్ని అంశాలపై జీఎస్టీ మినహాయింపులను ఆర్థిక మంత్రి కోరారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కోసం ఏపీ ఖర్చు పెట్టిన రూ. 176 కోట్ల నిధులను రీ-ఇంబర్స్ చేయాలని కోరిన ఏపీ.. ఉడాన్ పథకంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుని తిరిగివ్వాలని ప్రతిపాదనలు చేసింది.. ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు వినియోగంలోకి వచ్చాక.. విశాఖ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు…