(అక్టోబర్ 4న తమ్మారెడ్డి కృష్ణమూర్తి జయంతి) ఇంతింతై వటుడింతై అన్నచందాన తమ్మారెడ్డి కృష్ణమూర్తి చిత్రసీమలో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అభిరుచి గల నిర్మాతగా నిలిచారు. ఆరంభంలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ తరువాత నిర్మాతగా మారి, తెలుగువారిని అలరించే చిత్రాలు తెరకెక్కించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై రూపొందిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ లో తెలుగు చిత్రపరిశ్రమ నెలకొనడానికి కృషి చేసిన వారిలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా ఉన్నారు. కృష్ణమూర్తి చిత్రసీమకు చేసిన సేవలకు…