టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే చాలు సినిమా సగం సక్సెస్ అనే భావనలో ప్రేక్షకులు ఉండిపోతారు. దేవిశ్రీ సంగీతంతో పాటుగా అప్పుడప్పుడు సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు. అయితే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్లు గతంలోనే చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా దేవిశ్రీని హీరోగా పరిచయం చేసేందుకు నటి, నిర్మాత ఛార్మి సన్నాహాలు చేస్తుందట. ఆయన…