ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.
సోమవారం ఎపి మినిస్టర్ పేర్ని నానితో టాలీవుడ్ సమస్యలపై చిత్రప్రముఖుల భేటీ జరిగింది. అందులో ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ వందల కోట్ల వసూళ్ళు అంటూ పేపర్లలో ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అని అన్నాడు. మా సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే అలాంటి ప్రకటన ఇస్తుంటామని చెప్పారాయన. అది సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని మంత్రి పేర్ని…