బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమిస్తున్నారు. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగాయి. అయితే, సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఈనెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకు లు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడం తో నవంబర్ లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు. అప్పుడు మూడు రోజులు సమ్మె చేశామని ఆసమ్మె ఫలప్రదం…
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని…
కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. కార్మికుల డిమాండ్లు ఏంటంటే… కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవడం, అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది…