ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శ్రీ వకుళమాత ఆలయం, (పాతకాల్వ (పేరూరు), తిరుపతి) ప్రారంభోత్సవానికి ఆహ్వనించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 న అంకురార్పణతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతాయి. ఆహ్వానపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు…
భూమిలాంటి గ్రహాలు ఈ విశాలమైన విశ్వంలో అనేకం ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఒకవేళ గ్రహాల్లో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉంటారు. వారు మనుషుల కన్నా టెక్నికల్‌గా అభివృద్ధి సాధించిన వ్యక్తులా లేదా, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి నాసా ఎప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే గ్రహాంతరవాసుల జాడను కనుగొని తీరుతామని నాసా చెబుతున్నది. దీనికోసం 24 మంది పూజారుల సహాయం తీసుకోబోతున్నది. వివిధ మతాలకు చెందిన నిష్ణాతులైన పూజారులను దీనికోసం వినియోగించుకోబుతున్నది నాసా.…